Saturday, 25 February 2017

Mandenta Pothande Yelamanda song...




ఎలమంద సాంగ్ (తెలుగు)

మందేంట పోతండే ఎలమంద, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద...
చుస్తే సిన్నపోరగాడే ఎలమంద, వన్నె రుమాలే కట్టిండు ఎలమంద... (2)
అన్గిలేనివోట్టి పై గొంగలేసుకుండు,
అడ్డపంచెను బుడ్డ గోసిగ కట్టిండు,
కిర్రు తోలు జోళ్ళు కాళ్ళకు తోడిగిండు.....(కిర్రు తోలు/2/)
కందిజొన్న కోయ ఎలమంద, కౌంజు పిట్టవలె పోతుండు ఎలమంద
వేలెడంత లేదు ఎలమంద, వేయి మందకే వస్తాదు ఎలమంద..ఆ..(మందేంట పోతండే/2/)

ఎక్కరాని తుమ్మలెక్కి నరుకుతాడు,
 ఎత్తైన గుట్టలెల్ల తిరుగుతాడు
వాగుల వంకల రాగాలు తీస్తాడు.....(వాగుల/2/)
చెరువు గట్టున నిలిచి ఎలమంద చందమామోలె నవుతాడు ఎలమంద
తుమ్మనీడ ఉంటె ఎలమంద అమ్మావొడిని మరుసుతాడే ఎలమంద.....(మందేంట పోతండే/2/)

మూతికి జానెడు మోదుగ సుట్టను
 సేతి సద్దున పెట్టి గుప్పున గుంజేటి
 తండ్రిసెప్పిన మాట గీత దాటిపోడు.....(తండ్రిసెప్పిన /2/)
పిర్ర గిల్లంగనే ఎలమంద వాడు టిర్రుమంటడమ్మ ఎలమంద
 వీడు కూత పెట్టంగనే ఎలమంద వేట తోడేళ్ళు పరారు ఎలమంద.....(మందేంట పోతండే/2/)

తుంపరొచ్చి గొర్రె తుమ్మిన దగ్గిన
 ముల్లుకొట్టి గొర్రె కాలిడ్చిన గాని
 తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు....(తట్టుకోడు/2/)
కొట్టకులోట్టకు ఎలమంద చెట్టు నూరి కట్టుతాడే ఎలమంద
 యాడ నేర్చిన విద్య ఎలమంద,గొల్ల కురమవాడ విద్య ఎలమంద.....(మందేంట పోతండే/2/)

యడాదికోసారి గోర్లేల్లి పోతుంటే...
తోడుగున్న గొర్లు యాడికిపొతున్నయని తల్లినడుగుతాడు తండ్రినడుగుతాడు
గొర్ల కటికివనికమ్మ ఎలమంద కండ్ల నీళ్ళు పెడతాడమ్మ ఎలమంద
గొర్లు తరలిపోతువుంటే ఎలమంద వాడు గోల్లుమంటడమ్మ ఎలమంద(వాడు గోల్లుమంటడమ్మ..)...ఓ..
---------------------------------------------------------------------------------------------
Yellamanda Song(English)



Mandenta  pothande  yellamanda, Vaadu   yevvari  Kodukamma  yellamanda
Chuste  Sinna pooragade yelamanda, vanne rumaale kattindu yelamanda…..(2)
Angilenonti pai gogalesukundu,
Adda panchenu udda gosiga kattindu
Kirru tolu jollu kallaku todingindu…..(Kirru tolu/2/)
Kandijonna koya yelamanda, kaunju pittole pothunde yelamanda
Veledantha ledu yelamanda,veyyi mandeke vasthadu yelamanda....(mandenta../2/)

Yekkarani thummalekki narukutadu,
Yettaina guttalella tirugutaadu
vaagula vankala taagalu teestadu....(Vagula/2/)
cheruvu gattuna nilichi yelamanda chandamamole navutaadu elamanda
thumma needa unte yelamanda ammavodini marusutaade yelamanda...(mandenta../2/)


muthiki jaanedu modugu suttanu
sethisanduna petti guppuna gunjeti
tandriseppina mata geetha datipodu(Tandri../2/)
pirra gillangane yelamanda vaadu tiruumantadamma yelamanda
veedu kutha pettangane yelamanda,veta thodellu pararu yelamanda......(mandenta../2/)

thumparocchi gorre thummina daggina
mullukotti gorre kalidchina gaani
thattukodu vaadu thalladillutaadu....(thattukodu/2/)
kottakulottaku yelamanda chettu noori kattuthade yelamanda
yaada nerchina vidya yelamanda,golla kuramavaada vidya yelamanda.....(mandenta../2/)


yadadhikosaari gorlelli pothunte..
todugunna gorlu yadkipotunayani thallinadugutaadu thandrinadugutaadu
gorlu tharali potaaunte yelamanda vaadu gollumantadamma yelamanda....(vaadu gollumantadamma


----------------------------------------------------------------------------------------------------------------------------------




Tuesday, 17 January 2017

Amma Bayalellinaado song Lyrics


Lyrics (Telugu)


అమ్మ బయలెల్లినాదో................ అమ్మ తల్లి బయలెల్లినాదో............. అమ్మ తల్లి బయలెల్లినాదో.............
అమ్మ బయలెల్లినాదో నాయన.....తల్లి బయలెల్లినాదో..//అమ్మ//
లస్కరులొ బోనలమ్మో..మాయమ్మ కదలొచ్చే మంకాలమ్మ....//లస్కరు//
అమ్మ బయలెల్లినాదో నాయన.....తల్లి బయలెల్లినాదో...//అమ్మ//

పోతరాజులేగురంగా.......అమ్మ మంకాళీ
శివసత్తులుగంగా... తల్లి మంకాళీ
లస్కరులో బోనాలు... అమ్మ మంకాళీ
డప్పులతో జనాలు... తల్లి మంకాళీ
లస్కరులో బోనాలు డప్పులతో జనంతో...
అమ్మ బయలెల్లినాదో నాయనా.....తల్లి బయలెల్లినాదో....//అమ్మ//

పోరగాన్లు, పోట్టెగాన్లు.... అమ్మ మంకాళీ
తీనుమారు ఆడుకుంటా... తల్లి మంకాళీ
చారుమీనారుకాడ.... అమ్మ మంకాళీ ...
గల్లి గల్లి లొల్లి లొల్లి... తల్లి మంకాళీ
చారుమీనారుకాడ గల్లి గల్లి లొల్లి లొల్లి........హ
అమ్మ బయలెల్లినాదో నాయనా.....తల్లి బయలెల్లినాదో... //అమ్మ//
లస్కరులొ బోనలమ్మో..మాయమ్మ కదలొచ్చే మంకాలమ్మో....//లస్కరు//

 కల్లు సాగ కోడి పుంజు... అమ్మ మంకాళీ
కొత్త సీరా కొత్త రవిక...తల్లీ మంకాళీ
సంకపిల్ల నెత్తుకోని... అమ్మ మంకాళీ
నిన్ను సూడ వత్తునమ్మ... తల్లీ మంకాళీ
సంకపిల్ల నెత్తుకోని...నిన్ను సూడ వత్తునమ్మ
అమ్మ బయలెల్లినాదో నాయనా.....తల్లి బయలెల్లినాదో... //అమ్మ//
లస్కరులొ బోనలమ్మో..మాయమ్మ కదలొచ్చే మంకాలమ్మో....//లస్కరు//
  
అమ్మమ్మో మాయమ్మో.......ఓ...అమ్మమ్మో మాయమ్మో... తల్లీ మంకాలమ్మో
మా పిల్ల పాపలనమ్మో...మాయమ్మ
సల్లంగా దీవించమ్మో.....//మా పిల్ల//
మా పిల్ల పాపలనమ్మో...మాయమ్మ..
సల్లంగా దీవించమ్మో.....//మా పిల్ల//
లస్కరు బోనలమ్మో....మా యమ్మ కదలొచ్చే మంకాలమ్మ.....
లస్కరు బోనలమ్మో....మా యమ్మ కదలొచ్చే మంకాలమ్మ.....
............................................................................................................................................
..................................జానపదాలు పాడుకుందాం....జాతిని కాపాడుకుందాం.....................................
........................................................ధన్యవాదాలు...................................................................

Saturday, 14 January 2017

Goreti venkanna - Kancharegi teepivole lachuvammo


Lyrics(Telugu):

కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో.....
నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...
కంచరేగి తీపి వోలె లచ్చువమ్మో.....
నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...నీ కంఠమెంత మధురమే లచ్చువమ్మ...

పారే యేరు అలలమీద పండు వెన్నెల రాలినట్టు... ఊరే  ఊట సేలిమే లోన తేటనీరు లోలికినట్టు...
వెండి మెరుపుల నవ్వునీదే..... వెండి మెరుపుల నవ్వునీదే లచ్చుమ్మో.....
నీది ఎంతసక్కని రూపమే లచ్చుమ్మ.....             // కంచరేగి తీపి//

మంచె ఎక్కి కేకపెడితే కంచిమేకలు చుట్టుచేరె....నీ అల్లరిని ఆ లేగదూడలు వల్లెకొచ్చి వోదిగిపోవును...
వాలిపోయిన కందిసేనే..... వాలిపోయిన కందిసేనే లచ్చుమ్మో.....
నివు పాటపాడితె పూత పడతది లచ్చుమ్మ.....        // కంచరేగి తీపి//

కోడికూతకు ముందులేసి పేడనీళ్ళు కల్లాపి చల్లి...ముచ్చటోలుకు  ముగ్గులేసే మునివేళ్ళ గోరు పైన...
 పొద్దే ముద్దయి గోరింటైతదే ..... పొద్దే ముద్దయి గోరింటైతదే లచ్చుమ్మో.....
పొడఎండ నీ మెడ హారమైతది లచ్చుమ్మ.....        // కంచరేగి తీపి//

ఆకుదెమ్పి అలముదెమ్పి మేకలకు నివు మేతవేసి...దున్నియేర్రని దుక్కులల్లో  దుసరిపొదల పాన్పుపైన...
అలసినీవు కునుకుపడితే..... అలసినీవు కునుకుపడితే లచ్చుమ్మో.....
ఆ ఎండకడ్డము తెప్పలొస్తవే లచ్చుమ్మ..... // కంచరేగి తీపి//

నీ కాలిఅందెల సవ్వడికి తాబేళ్లు ఇసుకల గంతులేస్తవి...జాలిగల నీ సూపులకు తోడేళ్ళు సాదుజీవులైతవి...
దారిలో పల్లేరుముల్లె..... దారిలో పల్లేరుముల్లె లచ్చుమ్మో.....
నీకాలు మోపితె మల్లెలైతవే లచ్చుమ్మ.....           // కంచరేగి తీపి//

ఏరువాక నీవుజల్లితే సాలువారని గింజలుండవు.....నీ ప్రేమనెరిగి  పక్చులన్ని పాలకంకులు తున్చివేయవు...
నీ సెమటసుక్కలు రాలుతుంటే.... నీ సెమటసుక్కలు రాలుతుంటే లచ్చుమ్మో.....
ఆసేను సెలకలు దోసిలొగ్గునే లచ్చుమ్మ......          // కంచరేగి తీపి//

......................................................................................................................................
..........జానపదాలను   ఆదరిద్దం...........జాతిని కాపాడుకుందాం.....................................
........................................................ధన్యవాదాలు..........................................................

Lyrics (English): 


Kancharegi teepi vole lachhuvammo…..
Nee kantamentha madhurame lachhuvamma… 
Kancharegi teepi vole lachhuvammo…..
Nee kantamentha madhurame lachhuvamma… Nee kantamentha madhurame lachhuvamma…

Paare yeru alalameeda pandu vennela raalinattu…ure uta selime loona thetaneeru lolikinattu…
Vendi merupula navvuneede…..vendi merupula navvuneede lachhuvammo…..
Needi enthasakkani roopame lachhuvamma….                   //kancharegi teepi//

Manche ekki kekapedithe kanchimekalu chuttuchere….nee allarini aa legadhudalu vallekochhi vodhigipovunu….
Vaalipoyina kandhisene…..Vaalipoyina kandhisene lachhuvammo….
Nevu paatapadithe putha padatadi lachhuvamma….          //kancharegi teepi//


Kodikuthaku mundulesi pedaneella kallapi challi…muchhatoluku muggulese munivella goru paina…
Podhe muddhai gorintaithadi ….. Podhe muddhai gorintaithadi lachhuvammo….
Podayenda nee meda haramaitadhi lachuvamma…..         //kancharegi teepi//

Aakudempi alamudempi mekalaku nivu methavesi….dhunni yerrrani dukkulallo dusaripodala paanpupaina….
Alasineevu kunukupadithe….. Alasineevu kunukupadithe lachhuvammo…..
Aa endakaddamu teppalostavi lachhuvamma…..           //kancharegi teepi//

Nee kaaliandela savvadiki thabellu isukala ganthulestavi..…jaaligala nee supulaku thodellu saadujeevulaitavi…..
Daarilo pallerumulle….. Daarilo pallerumulle lachhuvammo…..
Neekaalu mopithe mallelaitave lachhuvamma…..               //kancharegi teepi//

Yeruvaaka neevujallite saaluvaarani ginjalundavu…..nee premanerigi pachulanni palakankulu thunchiveyavu…..
Nee semetasukkalu raaluthunte….. Nee semetasukkalu raaluthunte lachhuvammo …
Aasenu selakalu dhosiloggune lachhuvamma ……//kancharegi teepi//